View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన వన్దే వాసుదేవం
వన్దే వాసుదేవం బృన్దారకాధీశ
వన్దిత పదాబ్జం ‖
ఇన్దీవరశ్యామ మిన్దిరాకుచతటీ-
చన్దనాఙ్కిత లసత్చారు దేహం |
మన్దార మాలికామకుట సంశోభితం
కన్దర్పజనక మరవిన్దనాభం ‖
ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప-
న్నగరాజ శాయినం ఘననివాసం ‖
కరిపురనాథసంరక్షణే తత్పరం
కరిరాజవరద సఙ్గతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరు వేఙ్కటాచలాధీశం భజే ‖