View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన వందే వాసుదేవం

వందే వాసుదేవం బృందారకాధీశ
వందిత పదాబ్జం ‖

ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-
చందనాంకిత లసత్చారు దేహం |
మందార మాలికామకుట సంశోభితం
కందర్పజనక మరవిందనాభం ‖

ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప-
న్నగరాజ శాయినం ఘననివాసం ‖

కరిపురనాథసంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరు వేంకటాచలాధీశం భజే ‖