View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
త్యాగరాజ పఞ్చరత్న కీర్తన కన కన రుచిరా
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: వరాళి
తాళం: ఆది
కన కన రుచిరా
కనక వసన నిన్ను
దిన దినమును అనుదిన దినమును
మనసున చనువున నిన్ను
కన కన రుచిర కనక వసన నిన్ను
పాలుగారు మోమున
శ్రీయపార మహిమ కనరు నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను
కళకళమను ముఖకళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను
బాలాకాభ సుచేల మణిమయ మాలాలఙ్కృత కన్ధర
సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సన్తతమ్బు మనసారగ
కన కన రుచిరా కనక వసన నిన్ను
సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల
చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానిఞ్చి సుఖియిమ్పగ లేదా యటు
కన కన రుచిరా కనక వసన నిన్ను
మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద
పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి
వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను
సుఖాస్పద విముఖామ్బుధర పవన విదేహ మానస విహారాప్త
సురభూజ మానిత గుణాఙ్క చిదానన్ద ఖగ తురఙ్గ ధృత రథఙ్గ
పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే
కన కన రుచిరా కనక వసన నిన్ను
కామిఞ్చి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను
వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి
మరియు నారద పరాశర శుక శౌనక పురన్ధర నగజా ధరజ
ముఖ్యులు సాక్షి గాదా సున్దరేశ సుఖ కలశామ్బుధి వాసా శ్రితులకే
కన కన రుచిరా కనక వసన నిన్ను
సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత
ముఖజిత కుముదహిత వరద నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను
కన కన రుచిరా