View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన వేడుకొన్దామా
వేడుకొన్దామా వేఙ్కటగిరి వేఙ్కటేశ్వరుని ‖
ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు |
తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ‖
వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు |
గొడ్డురాణ్డ్రకు బిడ్డలిచ్చే గోవిన్దుడే ‖
ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు |
అలమేల్మఙ్గా శ్రీవేఙ్కటాద్రి నాథుడే ‖