View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన వేడుకొందామా

వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ‖

ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు |
తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ‖

వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు |
గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ‖

ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు |
అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ‖