View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన షోడశ కళానిధికి

షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ‖

అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ
నిలయున కాసనము నెమ్మినిదే |
అలగఙ్గా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే ‖

వరపీతామ్బరునకు వస్త్రాలఙ్కారమిదె
సరి శ్రీమన్తునకు భూషణము లివే |
ధరణీధరునకు గన్ధపుష్ప ధూపములు
తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ‖

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జన్ద్రునేత్రునకు కప్పురవిడెము |
అమరిన శ్రీవేఙ్కటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దణ్డములు నివిగో ‖