View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద

రాగం: సాళఙ్గనాట

ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు |
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ‖

అన్త నిన్త గొల్లెతల అరచేతి మాణిక్యము |
పన్త మాడే కంసుని పాలి వజ్రము |
కాన్తుల మూడు లోకాల గరుడ పచ్చ బూస |
చెన్తల మాలో నున్న చిన్ని కృష్ణుడు ‖

రతికేళి రుక్మిణికి రఙ్గు మోవి పగడము |
మితి గోవర్ధనపు గోమేధికము |
సతమై శఙ్ఖ చక్రాల సన్దుల వైడూర్యము |
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ‖

కాళిఙ్గుని తలలపై గప్పిన పుష్యరాగము |
యేలేటి శ్రీ వేఙ్కటాద్రి యిన్ద్రనీలము |
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము |
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు ‖