View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన మహినుద్యోగి కావలె
మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజి వలె నుణ్డి ఏమి సాధిఞ్చలెడు ‖
వెదకి తలచుకుణ్టే విష్ణుడు కానవచ్చు |
చెదరి మరచితే సృష్టి చీకటౌ |
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు |
నిదురిఞ్చితే కాలము నిమిషమై తోచు ‖
వేడుకతో చదివితే వేదశాస్త్ర సమ్పన్నుడౌ |
జాడతో నూరకుణ్డితే జడుడౌను |
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ |
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను ‖
మురహరు గొలిచితే మోక్షము సాధిఞ్చవచ్చు |
వెరవెరగక ఉణ్డితే వీరిడియౌను |
శరణణ్టే శ్రీవేఙ్కటేశ్వరుడు రక్షిఞ్చును |
పరగ సంశయిఞ్చితే పాషణ్డుడౌను ‖