View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి
రాగం: లలిత
జయలక్ష్మి వరలక్ష్మి సఙ్గ్రామ వీరలక్ష్మి |
ప్రియురాలవై హరికిం బెరసితివమ్మా ‖
పాలజలనిధిలోని పసనైనమీఙ్గడ
మేలిమితామరలోని మిఞ్చువాసన |
నీలవర్ణునురముపై నిణ్డిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ‖
చన్దురుతోడం బుట్టిన సమ్పదలమెఱుఙ్గవో
కన్దువ బ్రహ్మలం గాచేకల్పవల్లి |
అన్దినగోవిన్దునికి అణ్డనే తోడునీడవై
వున్దానవు మా^^ఇణ్టనే వుణ్డవమ్మా ‖
పదియారువన్నెలతో బఙ్గారుపతిమ
చెదరనివేదములచిగురుమ్బోడి |
యెదుట శ్రీవేఙ్కటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ‖