View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి
రాగం: లలిత
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి |
ప్రియురాలవై హరికి~ం బెరసితివమ్మా ‖
పాలజలనిధిలోని పసనైనమీ~ంగడ
మేలిమితామరలోని మించువాసన |
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ‖
చందురుతోడ~ం బుట్టిన సంపదలమెఱు~ంగవో
కందువ బ్రహ్మల~ం గాచేకల్పవల్లి |
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మా^^ఇంటనే వుండవమ్మా ‖
పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరనివేదములచిగురు~ంబోడి |
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ‖