View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన దాచుకో నీ పాదాలకు

రాగం: ఆరభి

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి |
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ‖

వొక్క సఙ్కీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షిఞ్చగ |
తక్కినవి భాణ్డారాన దాచి వుణ్డనీ |
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము |
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా ‖

నానాలికపైనుణ్డి నానాసఙ్కీర్తనలు |
పూని నాచే నిన్ను బొగడిఞ్చితివి |
వేనామాల వెన్నుడా వినుతిఞ్చ నెన్తవాడ |
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి విన్తేయయ్యా ‖

యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని |
చేముఞ్చి నాస్వాతన్త్ర్యము చెప్పినవాడగాను |
నేమాన బాడేవాడను నేరము లెఞ్చకుమీ |
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేఙ్కటేశుడవయ్యా ‖