View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన చాలదా బ్రహ్మమిది
చాలదా బ్రహ్మమిది సఙ్కీర్తనం మీకు |
జాలెల్ల నడగిఞ్చు సఙ్కీర్తనం ‖
సన్తోష కరమైన సఙ్కీర్తనం |
సన్తాప మణగిఞ్చు సఙ్కీర్తనం |
జన్తువుల రక్షిఞ్చు సఙ్కీర్తనం |
సన్తతము దలచుడీ సఙ్కీర్తనం ‖
సామజము గాఞ్చినది సఙ్కీర్తనం |
సామమున కెక్కుడీ సఙ్కీర్తనం |
సామీప్య మిన్దరికి సఙ్కీర్తనం |
సామాన్యమా విష్ణు సఙ్కీర్తనం ‖
జముబారి విడిపిఞ్చు సఙ్కీర్తనం |
సమ బుద్ధి వొడమిఞ్చు సఙ్కీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సఙ్కీర్తనం |
శమదమాదుల జేయు సఙ్కీర్తనం ‖
జలజాసనుని నోరి సఙ్కీర్తనం |
చలిగొణ్డ సుతదలచు సఙ్కీర్తనం |
చలువ గడు నాలుకకు సఙ్కీర్తనం |
చలపట్టి తలచుడీ సఙ్కీర్తనం ‖
సరవి సమ్పదలిచ్చు సఙ్కీర్తనం |
సరిలేని దిదియపో సఙ్కీర్తనం |
సరుస వేఙ్కట విభుని సఙ్కీర్తనం |
సరుగనను దలచుడీ సఙ్కీర్తనం ‖