View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన భావయామి గోపాలబాలం
కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు
రాగం: యమునా కళ్యాణి
తాళం: ఆది
భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చిన్తయేహం సదా ‖
కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘణ్టికా-
పటల నినదేన విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సఙ్కుల శిఞ్జితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ‖
నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం |
తిరువేఙ్కటాచల స్థితం అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం ‖