View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

త్యాగరాజ పఞ్చరత్న కీర్తన ఎన్దరో మహానుభావులు

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: శ్రీ
తాళం: ఆది

ఎన్దరో మహానుభావులు అన్దరికీ వన్దనములు

చన్దురూ వర్ణుని అన్ద చన్దమును హృదయారవున్దమున
జూచి బ్రహ్మానన్దమనుభవిఞ్చు వారెన్దరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెన్దరో మహానుభావులు

మానసవన చర వర సఞ్చారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెన్దరో మహానుభావులు

సరగున పాదములకు స్వాన్తమను సరోజమును సమర్పణము
సేయువారెన్దరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురిఞ్చి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెన్దరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెన్దరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనన్ద పయోధి నిమగ్నులై ముదమ్బునను యశము
గలవారెన్దరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనన్దన
దిగీశ సుర కిమ్పురుష కనక కశిపు సుత నారద తుమ్బురు
పవనసూను బాలచన్ద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎన్దరో మహానుభావులు

నీ మేను నామ వైభవమ్బులను
నీ పరాక్రమ ధైర్యముల శాన్త మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనిఞ్చకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరిఙ్గి
సన్తసమ్బునను గుణ భజనానన్ద కీర్తనము జేయు
వారెన్దరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాన్తరఙ్గముల భావమ్బులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెన్దరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెన్దరో మహానుభావులు
అన్దరికీ వన్దనము-లెన్దరో మహానుభావులు