View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
త్యాగరాజ కీర్తన గన్ధము పూయరుగా
రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది
పల్లవి:
గన్ధము పుయ్యరుగా పన్నీరు
గన్ధము పుయ్యరుగా
అను పల్లవి:
అన్దమయిన యదునన్దనుపై
కున్దరదన లిరవొన్దగ పరిమళ ‖గన్ధము‖
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ‖గన్ధము‖
చేలము గట్టరుగా బఙ్గారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ‖గన్ధము‖
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ‖గన్ధము‖
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ‖గన్ధము‖