View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
రామదాసు కీర్తన పలుకే బఙ్గారమాయెనా
పలుకే బఙ్గారమాయెనా, కోదణ్డపాణి పలుకే బఙ్గారమాయెనా
పలుకే బఙ్గారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తణ్డ్రీ
ఎన్త వేడినగాని సున్తైన దయరాదు
పన్తము సేయ నేనెన్తటివాడను తణ్డ్రీ
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణిఞ్చి బ్రోచితివని నెర నమ్మితిని తణ్డ్రీ
రాతి నాతిగ చేసి భూతలమున
ప్రఖ్యాతి చెన్దితివని ప్రీతితో నమ్మితి తణ్డ్రీ
శరణాగతత్రాణ బిరుదాఙ్కితుడవుకాదా
కరుణిఞ్చు భద్రాచల వరరామదాస పోష