View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
జాతికి ఊపిరి స్వాతన్త్ర్యం
జాతికి ఊపిరి స్వాతన్త్ర్యం, అది జ్యోతిగ వెలిగే చైతన్యం
ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యం ‖
శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే,
జలనిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే,
మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయం ‖
ఎప్పటి ఎప్పటి రుచిరస్వప్నం, ఈ స్వాతన్త్ర్యం
ఎన్దరి ఎన్దరి త్యాగ ఫలం, ఈ స్వాతన్త్ర్యం
అన్దక అన్దక అన్దిన ఫలమును అన్దరికీ అన్దివ్వణ్డి ‖
స్వరాజ్య సిద్ధికి లక్ష్యమేమిటో స్మరిఞ్చుకోణ్డి
జాతి విధాత వినూత్న ఫలాలను సాధిఞ్చణ్డి
సమస్యలన్నీ పరిష్కరిఞ్చే సౌమ్య మార్గం చూపణ్డి ‖
కలతలు కక్షలు రేపొద్దు ఏ కులం పేరుతో
మారణ హోమం జరపొద్దు ఏ మతం ముసుగులో
సమైక్య భారత సౌధాగ్రం పై, శాన్తి దీపం నిలపణ్డి ‖