View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
గోపాల కృష్ణ దశావతారమ్
మల్లెపూలహారమెయ్యవే
ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే
మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణ
మత్స్యావతారుడనెద
కుప్పికుచ్చుల జడలువెయ్యవే
ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే
కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణ
కూర్మావతారుడనెద
వరములిచ్చి దీవించవే
ఓయమ్మ నన్ను వరహావతారుడనవే
వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణ
వరహావతారుడనెద
నాణ్యమైన నగలువేయవే
ఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే
నాణ్యమైన నగలువేసెదా గోపాలకృష్ణ
నరసింహావతారుడనెద
వాయువేగ రథమునియ్యవే
ఓయమ్మ నన్ను వామనవతారుడనవే
వాయువేగ రథమునిచ్చెదా గోపాలకృష్ణ
వామనావతారుడనెద
పాలు పోసి బువ్వపెట్టవే
ఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే
పాలు పోసి బువ్వపెట్టెద గోపాలకృష్ణ
పరశురామావతారుడనెద
ఆనందబాలుడనవే
ఓయమ్మ నన్ను అయోధ్యవాసుడనవే
ఆనందబాలుడనెద గోపాలకృష్ణ
అయోధ్యవాసుడనెద
గోవులుకాచె బాలుడనవె
ఓయమ్మ నన్ను గోపాలకృష్ణుడనవే
గోవులుకాచె బాలుడనెద
నా తండ్రి నిన్ను గోపాలకృష్ణుడనెద
బుధ్ధులు కలిపి ముద్దపెట్టవే
ఓయమ్మ నన్ను బుధ్ధావతారుడనవే
బుధ్ధులు కలిపి ముద్దపెట్టెద గోపాలకృష్ణ
బుధ్ధావతారుడనెద
కాల్లకు పసిడిగజ్జెలు కట్టవే
ఓయమ్మ నన్ను కలికావతారుడనవే
కాల్లకు పసిడిగజ్జెలు కట్టెద గోపాలకృష్ణ
కలికావతారుడనెద