View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె
రాగం: భూపాళం
విన్నపాలు వినవలె విన్త విన్తలు |
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ‖
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు |
అల్లనల్ల నన్తనిన్త నదిగోవారే |
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు |
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ‖
గరుడ కిన్నరయక్ష కామినులు గములై |
విరహపు గీతముల విన్తాలాపాల |
పరిపరివిధముల బాడేరునిన్నదివో |
సిరిమొగము దెరచి చిత్తగిఞ్చవేలయ్యా ‖
పొఙ్కపు శేషాదులు తుమ్బురునారదాదులు |
పఙ్కజభవాదులు నీ పాదాలు చేరి |
అఙ్కెలనున్నారు లేచి అలమేలుమఙ్గను |
వేఙ్కటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ‖