View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన వేదం బెవ్వని

వేదం బెవ్వని వెదకెడివి |
ఆదేవుని గొనియాడుడీ ‖

అలరిన చైతన్యాత్మకు డెవ్వడు |
కలడెవ్వ డెచట గలడనిన |
తలతు రెవ్వనిని దనువియోగదశ |
యిల నాతని భజియించుడీ ‖

కడగి సకలరక్షకు డిందెవ్వడు |
వడి నింతయు నెవ్వనిమయము |
పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని |
దడవిన ఘనుడాతని గనుడు ‖

కదసి సకలలోకంబుల వారలు |
యిదివో కొలిచెద రెవ్వనిని |
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి |
వెదకి వెదకి సేవించుడీ ‖