View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన త్వమేవ శరణమ్

త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా ‖

వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా |
భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా ‖

బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద |
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా ‖

వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా |
పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా ‖