View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన తిరువీధుల మెఱసీ
తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ‖
తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద |
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ‖
గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ‖
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును గుర్రమెనిమిదోనాడు ‖
కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట |
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్^మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ‖