View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన తిరుమల గిరి రాయ
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ |
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ‖
సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ |
సరసవైభవరాయ సకలవినోదరాయ |
వరవసంతములరాయ వనితలవిటరాయ |
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ‖
గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ |
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ |
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ |
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ‖
సామసంగీతరాయ సర్వమోహనరాయ |
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ |
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను |
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ‖