View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన సువ్వి సువ్వి సువ్వాలమ్మ
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె ‖
శశి వొడచె అలసంబులు గదచె
దిశ దేవతల దిగుల్లు విడచె ‖
కావిరి విరసె కంసుడు గినిసె
వావిరి పువ్వుల వానలు గురిసె ‖
గతి సేసె అటు గాడిద గూసె
కుతిలకుడిచి జనకుడు నోరు మూసె ‖
గగురు పొడిచె లోకము విధి విడిచె
మొగులు గురియగ యమునపై నదచె ‖
కలిజారె వేంకటపతి మీరె
అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె ‖