View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ |
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ‖
కమలాసతీ ముఖకమల కమలహిత |
కమలప్రియ కమలేక్షణ |
కమలాసనహిత గరుడగమన శ్రీ |
కమలనాభ నీపదకమలమే శరణు ‖
పరమయోగిజన భాగధేయ శ్రీ |
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ |
తిరువేఙ్కటగిరి దేవ శరణు ‖