View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన శోభనమే శోభనమే

శోభనమే శోభనమే
వైభవముల పావన మూర్తికి ‖

అరుదుగ మును నరకాసురుడు |
సిరులతో జెరలు దెచ్చిన సతుల |
పరువపు వయసుల బదారు వేలను |
సొరిది బెండ్లాడిన సుముఖునికి ‖

చెందిన వేడుక శిశుపాలుడు |
అంది పెండ్లాడగ నవగళించి |
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి |
సందడి బెండ్లాడిన సరసునుకి ‖

దేవదానవుల ధీరతను |
దావతిపడి వార్థి దరుపగను |
శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన |
శ్రీ వేంకటగిరి శ్రీనిధికి ‖