View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన సిరుత నవ్వులవాడు
సిరుత నవ్వులవాడు సిన్నెకా వీడు
వెరపెరుగడు సూడవే సిన్నెకా ‖
పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెకా |
గొలుసుల వఙ్కల కోరలతోబూమి
వెలిసినాడు సూడవే సిన్నెకా ‖
మేటి కురుచవాడు మెడమీది గొడ్డలి
సీటకాలవాడు సిన్నెకా |
ఆటదానిబాసి అడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెకా ‖
బిఙ్కపు మోతల పిల్లగోవివాడు
సిఙ్క సూపులవాడు సిన్నెకా |
కొఙ్కక కలికియై కొసరి కూడె నన్ను
వేఙ్కటేశుడు సూడవే సిన్నెకా ‖