View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన రాజీవ నేత్రాయ
రాజీవ నేత్రాయ రాఘవాయ నమో |
సౌజన్య నిలయాయ జానకీశాయ ‖
దశరథ తనూజాయ తాటక దమనాయ
కుశిక సమ్భవ యజ్ఞ గోపనాయ |
పశుపతి మహా ధనుర్భఞ్జనాయ నమో
విశద భార్గవరామ విజయ కరుణాయ ‖
భరిత ధర్మాయ శుర్పణఖాఙ్గ హరణాయ
ఖరదూషణాయ రిపు ఖణ్డనాయ |
తరణి సమ్భవ సైన్య రక్షకాయనమో
నిరుపమ మహా వారినిధి బన్ధనాయ ‖
హత రావణాయ సంయమి నాథ వరదాయ
అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేఙ్కటేశ్వరాయ నమో
వితత వావిలిపాటి వీర రామాయ ‖