View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన పుట్టు భోగులము మేము
పుట్టుభోగులము మేము భువి హరిదాసులము |
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ‖
పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు |
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ‖
గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు ‖
భామిని యాకె మగని ప్రాణధారి లెంక-
లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ‖
పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు |
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ‖