View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన పుట్టు భోగులము మేము

పుట్టుభోగులము మేము భువి హరిదాసులము |
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ‖

పల్లకీలు నన్దనాలు పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు |
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ‖

గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాన్తకు నఙ్గభేదాలు ‖
భామిని యాకె మగని ప్రాణధారి లెఙ్క-
లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ‖

పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మతణ్డ్రి శ్రీ వేఙ్కటేశుడు |
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ‖