View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన పొడగణ్టిమయ్య
రాగం:అట్టతాళం
పొడగణ్టిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా ‖
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా |
గారవిఞ్చి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా ‖
భావిమ్ప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చిన్తామణీ |
కావిఞ్చి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షిఞ్చేటి ధరణీధరా ‖
చెడనీక బ్రతికిఞ్చే సిద్ధమన్త్రమా, రోగా
లడచి రక్షిఞ్చే దివ్యౌషధమా |
బడిబాయక తిరిగే ప్రాణబన్ధుడా, మమ్ము
గడియిఞ్చినట్టి శ్రీ వేఙ్కటనాథుడా ‖