View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన పిడికిట తలమ్బ్రాల

పిడికిట తలమ్బ్రాల పెణ్డ్లి కూతురు కొన్త |
పడమరలి నవ్వీనె పెణ్డ్లి కూతురు ‖

పేరుకల జవరాలె పెణ్డ్లి కూతురు పెద్ద |
పేరుల ముత్యాల మేడ పెణ్డ్లి కూతురు |
పేరణ్టాణ్డ్ల నడిమి పెణ్డ్లి కూతురు విభు |
పేరుకుచ్చు సిగ్గువడీ బెణ్డ్లి కూతురు ‖

బిరుదు పెణ్డము వెట్టె బెణ్డ్లి కూతురు నెర |
బిరుదు మగని కణ్టె బెణ్డ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెణ్డ్లి కూతురూ పతి |
బెరరేచీ నిదివో పెణ్డ్లి కూతురు ‖

పెట్టెనే పెద్ద తురుము పెణ్డ్లి కూతురు నేడె |
పెట్టెడు చీరలు గట్టి పెణ్డ్లి కూతురు |
గట్టిగ వేఙ్కటపతి కౌగిటను |
పెట్టిన నిధానమయిన పెణ్డ్లి కూతురు ‖