View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన పెరిగినాడు చూడరోఇ

పెరిగినాడు చూడరో పెద్ద హనుమన్తుడు |
పరగి నానా విద్యల బలవన్తుడు ‖

రక్కసుల పాలికి రణరఙ్గ శూరుడు
వెక్కసపు ఏకాఙ్గ వీరుడు |
దిక్కులకు సఞ్జీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు ‖

లలిమీరిన యట్టి లావుల భీముడు
బలు కపికుల సార్వభౌముడు |
నెలకొన్న లఙ్కా నిర్థూమధాముడు
తలపున శ్రీరాము నాత్మారాముడు ‖

దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావిమ్పగల తపః ఫల పుణ్యుడు |
శ్రీవేఙ్కటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు ‖