View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన పవనాత్మజ ఓ ఘనుడా
ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగా పరిగితిగా |
ఓ హనుమంతుడ ఉదయాచల ని-
ర్వాహక నిజ సర్వ ప్రబలా |
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహస మిటువలె చాటితిగా ‖
ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
మారులేక మతి మలసితిగా |
దారుణపు వినతా తనయాదులు
గారవింప నిటు కలిగితిగా ‖
ఓ దశముఖ హర ఓ వేంకటపతి-
పాదసరోరుహ పాలకుడా |
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా ‖