View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన పలుకు తేనెల తల్లి
రాగం: సాళఙ్గనాట
పలుకు దేనెల తల్లి పవళిఞ్చెను |
కలికి తనముల విభుని గలసినది గాన ‖
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళిఞ్చెను |
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన ‖
కొఙ్గు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బఙ్గారు మేడపై బవళిఞ్చెను |
చెఙ్గలువ కనుగొనల సిఙ్గారములు దొలక
అఙ్గజ గురునితోడ నలసినదిగాన ‖
మురిపెమ్పు నటనతో ముత్యాల మలగుపై
పరవశమ్బున దరుణి పవళిఞ్చెను |
తిరు వేఙ్కటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నణ్టినదిగాన ‖