View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన నెలమూడు శోభనాలు
నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు |
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ‖
రామనామమతనిది రామవు నీవైతేను |
చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడన్దురతని వామనయనవు నీవు |
ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ‖
హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు |
కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు |
బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ‖
జలజ నాభుడతడు జలజముఖివి నీవు |
అలమేలుమఙ్గవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేఙ్కటేశుడిటు నిన్నురానమోచె |
పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ‖