View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన నవనీతచోరా నమో నమో
నవనీతచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో ‖
హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో |
మురహర పద్మ నాభ ముకున్ద గోవిన్ద
నరనారాయణరూప నమో నమో ‖
నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నన్దగోప నమో నమో |
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమో నమో ‖
వైకుణ్ఠ రుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవన్దిత నమో నమో |
శ్రీకరగుణనిధి శ్రీ వేఙ్కటేశ్వర
నాకజనననుత నమో నమో ‖