View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.

అన్నమయ్య కీర్తన నారాయణాఅయ నమో నమో

నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో
యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ‖

గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో |
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు
యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ‖

దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో
శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో |
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో
యీమేరలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ‖

పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో |
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో
యిరవుగ నీగతి నెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ‖