View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన నల్లని మేని
నల్లని మేని నగవు చూపుల వాడు |
తెల్లని కన్నుల దేవుడు ‖
బిరుసైన దనుజుల పింఛమణచినట్టి |
తిరుపు కైదువ తోడి దేవుడు |
సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి |
తెరవు చూపినట్టి దేవుడు ‖
నీటగలసినట్టి నిండిన చదువులు |
తేట పరచినట్టి దేవుడు |
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు |
తీట రాసినట్టి దేవుడు ‖
గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న |
తిరువేంకటాద్రిపై దేవుడు |
తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి |
తెరచి రాజన్నట్టి దేవుడు ‖