View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన నగవులు నిజమని

నగవులు నిజమని నమ్మేదా |
వొగినడియాసలు వొద్దనవే ‖

తొల్లిటి కర్మము దొన్తల నుణ్డగ |
చెల్లబోయిక జేసేదా |
యెల్ల లోకములు యేలేటి దేవుడ |
వొల్ల నొల్లనిక నొద్దనవే ‖

పోయిన జన్మము పొరుగులనుణ్డగ |
చీయనక యిన్దు జెలగేదా |
వేయినామముల వెన్నుడమాయలు |
ఓ యయ్య యిఙ్క నొద్దనవే ‖

నలి నీనామము నాలికనుణ్డగ |
తలకొని యితరము దడవేదా |
బలు శ్రీ వేఙ్కటపతి నిన్నుగొలిచి |
వొలుకు చఞ్చలము లొద్దనవే ‖