View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన మేలుకో శ్రుంగారరాయ
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల |
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ‖
సందడిచే గోపికల జవ్వనవనములోన |
కందువందిరిగే మదగజమవు |
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని |
గంధము మరిగినట్టి గండు తుమ్మెద ‖
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో |
రతిముద్దు గురిసేటి రాచిలుకా |
సతుల పదారువేల జంట కన్నుల గలువల- |
కితమై పొడిమిన నా యిందు బింబమ ‖
వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై |
నిరతి వాలిన నా నీలమేఘమా |
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద |
గరిమ వరాలిచ్చే కల్పతరువా ‖