View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన మేదిని జీవుల గావ

మేదిని జీవుల గావ మేలుకోవయ్యా |
నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ‖

తగుగోపికల కన్నుదామరలు వికసిఞ్చె
మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా |
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ
నెగడిన పరఞ్జ్యోతి నిద్ర మేలుకోవయ్యా ‖

ఘనదురితపు గలువలు వికసిఞ్చె
మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా |
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ
జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ‖

వరలక్ష్మీ కుచచక్రవాకము లొణ్డొణ్టి రాయ
మెరయుదోషరహిత మేలుకోవయ్యా |
పొరసి నీవు నిత్యభోగములు భోగిఞ్చ
నిరతి శ్రీవేఙ్కటేశ నేడు మేలుకోవయ్యా ‖