View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన కులుకుగ నడవరో

రాగం: దేసాళం

కులుకక నడవరో కొమ్మలాలా |
జలజల రాలీని జాజులు మాయమ్మకు ‖

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాన్తులాలా |
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరిఞ్చె మా యమ్మకు నెన్నుదురు ‖

చల్లెడి గన్దవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల |
మొల్లమైన కున్దనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గఙ్కణాలు గదలీమాయమ్మకు ‖

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో |
అమరిఞ్చి కౌగిట నలమేలు మఙ్గనిదె
సమకూడె వేఙ్కటేశ్వరుడు మా యమ్మకు ‖