View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన కొణ్డలలో నెలకొన్న

కొణ్డలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొణ్డలన్త వరములు గుప్పెడు వాడు ‖

కుమ్మర దాసుడైన కురువరతి నమ్బి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు |
దొమ్ములు సేసిన యట్టి తొణ్డమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ‖

అచ్చపు వేడుకతోడ ననన్తాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు |
మచ్చిక దొలక తిరునమ్బి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ‖

కఞ్చిలోన నుణ్డు దిరుకచ్చినమ్బి మీద గరు-
ణిఞ్చి తన యెడకు రప్పిఞ్చిన వాడు |
యెఞ్చి ఎక్కుడైన వేఙ్కటేశుడు మనలకు
మఞ్చివాడై కరుణ బాలిఞ్చిన వాడు ‖