View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన కొలని దోపరికి

కొలని దోపరికి గొబ్బిల్లో యదు |
కుల స్వామికిని గొబ్బిల్లో ‖

కొణ్డ గొడుగుగా గోవుల గాచిన |
కొణ్డొక శిశువునకు గొబ్బిల్లో |
దణ్డగమ్పు దైత్యుల కెల్లను తల |
గుణ్డు గణ్డనికి గొబ్బిల్లో ‖

పాప విధుల శిశుపాలుని తిట్టుల |
కోపగానికిని గొబ్బిల్లో |
యేపున కంసుని యిడుమల బెట్టిన |
గోప బాలునికి గొబ్బిల్లో ‖

దణ్డివైరులను తరిమిన దనుజుల |
గుణ్డె దిగులునకు గొబ్బిల్లో |
వెణ్డిపైడి యగు వేఙ్కట గిరిపై |
కొణ్డలయ్యకును గొబ్బిల్లో ‖