View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన కోడెకాడె వీడె
కోడెకాడె వీడె వీడె గోవిన్దుడు
కూడె ఇద్దరు సతుల గోవిన్దుడు ‖
గొల్లెతల వలపిఞ్చె గోవిన్దుడు
కొల్లలాడె వెన్నలు గోవిన్దుడు |
గుల్ల సఙ్కుఞ్జక్రముల గోవిన్దుడు
గొల్లవారిణ్ట పెరిగె గోవిన్దుడు ‖
కోలచే పసులగాచె గోవిన్దుడు
కూలగుమ్మె కంసుని గోవిన్దుడు |
గోలయై వేల కొణ్డెత్తె గోవిన్దుడు
గూళెపుసతులం దెచ్చె గోవిన్దుడు ‖
కున్దనపు చేలతోడి గోవిన్దుడు
గొన్దులు సన్దులు దూరె గోవిన్దుడు |
కున్దని శ్రీవేఙ్కటాద్రి గోవిన్దుడు
గొన్దిం దోసె నసురల గోవిన్దుడు ‖