View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన కణ్టి శుక్రవారము

కణ్టి శుక్రవారము గడియ లేడిణ్ట |
అణ్టి అలమేల్మఙ్గ అణ్డనుణ్డే స్వామిని ‖

సొమ్ములన్నీ కడపెట్టి సొమ్పుతో గోణముగట్టి |
కమ్మని కదమ్బము కప్పు కన్నీరు |
చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి |
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుణ్డే స్వామిని ‖

పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనిఞ్చి |
తెచ్చి శిరసాదిగ దిగనలది |
అచ్చెరపడి చూడనన్దరి కనులకిమ్పై |
నిచ్చమల్లె పూవువలె నిటుతానుణ్డే స్వామిని ‖

తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు |
పట్టి కరిగిఞ్చు వెణ్డి పళ్యాలనిఞ్చి |
దట్టముగ మేను నిణ్డపట్టిఞ్చి దిద్ది |
బిట్టు వేడుక మురియు చుణ్డేబిత్తరి స్వామిని ‖