View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన కణ్టి నఖిలాణ్డ

కణ్టి నఖిలాణ్డ తతి కర్తనధికుని గణ్టి |
కణ్టి నఘములు వీడుకొణ్టి నిజమూర్తి గణ్టి ‖

మహనీయ ఘన ఫణామణుల శైలము గణ్టి |
బహు విభవముల మణ్టపములు గణ్టి |
సహజ నవరత్న కాఞ్చన వేదికలు గణ్టి |
రహి వహిఞ్చిన గోపురములవె కణ్టి ‖

పావనమ్బైన పాపవినాశము గణ్టి |
కైవశమ్బగు గగన గఙ్గ గణ్టి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగణ్టి |
కోవిదులు గొనియాడు కోనేరి గణ్టి ‖

పరమ యోగీన్ద్రులకు భావగోచరమైన |
సరిలేని పాదామ్బుజముల గణ్టి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గణ్టి |
తిరు వేఙ్కటాచలాధిపు జూడగణ్టి ‖