View this in:
This stotram is in సరళ తెలుగు. View this in
శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
అన్నమయ్య కీర్తన కామధేనువిదే
కామధేను విదే కల్పవృక్ష మిదే
ప్రామాణ్యము గల ప్రపన్నులకు ‖
హరినామజపమే ఆభరణంబులు
పరమాత్మునినుతి పరిమళము |
దరణిదరు పాదసేవే భోగము
పరమంబెరిగిన ప్రపన్నులకు ‖
దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము |
ఆవిష్ణు కైంకర్యమే సంసారము
పావనులగు యీ ప్రపన్నులకు ‖
యేపున శ్రీవేంకటేశుడే సర్వము
దాపై యితని వందనమే విధి |
కాపుగ శరణాగతులే చుట్టాలు
పై పయి గెలిచిన ప్రపన్నులకు ‖