View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అన్నమయ్య కీర్తన జగడపు చనువుల
జగడపు చనువుల జాజర
సగినల మఞ్చపు జాజర ‖
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ‖
భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గన్ధవొడి |
చేరువ పతిపై చిన్దగ పడతులు
సారెకు చల్లేరు జాజర ‖
బిఙ్కపు కూటమి పెనగేటి చెమటల
పఙ్కపు పూతల పరిమళము |
వేఙ్కటపతిపై వెలదులు నిఞ్చేరు
సఙ్కుమ దమ్బుల జాజర ‖